తెలంగాణ

telangana

ETV Bharat / city

'రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం' - telangana varthalu

రైతుకు మద్దతుధర ప్రకటించడంలో తెరాస సర్కారు విఫలమైందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే తెరాస కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.

'రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం'
'రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం'

By

Published : Jan 9, 2021, 3:31 PM IST

ధాన్యం కొనుగోలు చేయకుంటే తెరాస కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్‌ జాగీర్‌ కాదన్నారు. రైతుబంధు ఒట్టి మోసమని... రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్మశాన వాటికలు, డంపింగ్​ యార్డులను కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకంలోనే అభివృద్ది చేస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షలో పాల్గొని మాట్లాడారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పోరాడుతుందని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి వెల్లడించారు. రైతుల పక్షాన పోరాడుతున్న సంఘాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. దిల్లీ రైతుల కోసం 10వేల రూపాయలను భట్టి విక్రమార్కకు జానారెడ్డి అందజేశారు.

'రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం'

ఇదీ చదవండి: కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత.. ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details