నిజాం పాలన నాటి నుంచి సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని...తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. పదివేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే ఓ కొత్త ఉద్యోగస్తుడిని నియమించలేదని దుయ్యబట్టారు. సమ్మె ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని రాజిరెడ్డి విమర్శించారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
'ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర' - tsrtc
ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా తెరాస సర్కారు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"
"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"