శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారంటూ.. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్‌గా ఉంటూ తన అధికారిక ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస 20వేల ఓట్లతో గెలుస్తుందని అన్నారని ఫిర్యాదు పేర్కొన్నారు.
గుత్తాపై చర్యలు తీసుకోవాలి: ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు - Gutta Sukhender Latest Comments
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ.. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.
Gutta Sukhender
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి.. పార్టీలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన మండలి ఛైర్మన్ తెరాసకు అనుకూలంగా మాట్లాడడమే కాకుండా అందుకు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని తన ఛాంబర్‌ను ఉపయోగించుకోవడం తీవ్రమైన నేరమని వారు ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గుత్తాపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు.
ఇవీ చదవండి: