కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మరణాల సంఖ్య తగ్గించి చూపిస్తోందని హైకోర్టు అనడం... ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు తీసుకున్నామన్న ప్రభుత్వం... ఎక్కడ తీసుకున్నారో చెప్పాలని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ అరాచకంగా ప్రవర్తిస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. హుజూరాబాద్ వైద్యశాఖ ఉద్యోగి మరణానికి కారణం ఈటల రాజేందరే అని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రవీణ్ యాదవ్ మరణంపై డీజీపీ విచారణ చేస్తే అసలు విషయాలు బయటపడతాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ఆసుపత్రుల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
' ప్రభుత్వం స్పందించకపోతే..హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం' - uttam kumar reddy news
రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదని ఉత్తమ్ ఆరోపించారు. సిబ్బంది కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక ఏర్పాటు చేశామన్న భట్టి... ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే...హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సిబ్బంది లేకుండా మెరుగైన వైద్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సిబ్బంది కొరతపై నివేదిక ఏర్పాటు చేశామన్న భట్టి... ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ వైద్యశాఖకు నిధులు ఎక్కువగా కేటాయించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటిపై ప్రశ్నిస్తామన్నారు.
ఇవీ చూడండి:చమురు నౌకలో అగ్ని ప్రమాదం... మంటలు ఆర్పిన సహ్యాద్రి