గోషామహల్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ను పరామర్శించేందుకు వెళ్లిన నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఉదయం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు వారి అడ్డుకుని, అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.