లాక్డౌన్ వల్ల పేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఇంతవరకు ప్రజలకు చేరలేదని ఆరోపించారు.
'మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 వేయండి' - వి హనుమంతరావు వార్తలు
లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వీహెచ్.. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంకా అందలేదని ఆరోపించారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలెండర్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
'మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 వేయండి'
గతంలో కేంద్రం చెప్పిన విధంగా మహిళలు బ్యాంకు ఖాతాలు తెరిచారని.. వాటిలో కనీసం రూ.1500 జమచేయాలని డిమాండ్ చేశారు. ఉజ్వల పథకం కింద ఇంత వరకు ఒక్క గ్యాస్ సిలెండర్ అందలేదని విమర్శించారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలెండర్ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'