తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్ని కుట్రలు పన్నినా.. నెహ్రూ ముద్రను చెరపలేరు : వీహెచ్ - telangana news

జవహర్​లాల్ నెహ్రూ కీర్తిని తగ్గించి.. అప్రతిష్టపాలు చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్​లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

vh, v.hanumanth rao, congress leader vh
వీహెచ్, మోదీ సర్కార్​పై వీహెచ్ ఆగ్రహం, నెహ్రూ గురించి వీహెచ్

By

Published : May 27, 2021, 1:02 PM IST

మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్​లాల్​ నెహ్రూ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్​లోని నెహ్రూ విగ్రహానికి ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి.హన్మంతరావులు నివాళులర్పించారు.

నెహ్రూ కీర్తిని తగ్గించి అప్రతిష్ట పాలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నెహ్రూ ముద్రను చేరపలేరని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగులను తొలగిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధిని... నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details