VH On Fake News : సోషల్‌మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్... సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్, ఫేస్బుక్లో... పల్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో తాను, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోటోను సీఎం కేసీఆర్‌తో ఉన్నట్లు మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తాము తెరాస పార్టీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన తన ప్రస్థానంలో ఎప్పుడు ఇలా జరగలేదని... కావాలనే కొంత మంది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ పోలీసులను కోరారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని... అదే పార్టీలో చనిపోతానని... వేరే పార్టీలో చేరే ప్రసక్తేలేదని వీహెచ్ స్పష్టం చేశారు.
సెల్ఫోన్లు, సోషల్‌మీడియా రావడంతో వాళ్లకు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. భయం లేదు, భక్తి లేదు. పల్స్ఆఫ్ తెలంగాణ అనే ఒక ఖాతా పేరుతో.. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. హనుమంతరావు తెరాసలో చేరిపోతున్నారు. నేను కేసీఆర్ పక్కన నిలబడినట్లు, ఆ పక్కన జగ్గారెడ్డి ఉన్నట్లు క్రియేట్ చేశారు. నేను జగ్గారెడ్డిని కలిసింది ఆయన్ను సముదాయించేందుకు, పార్టీ వీడొద్దని చెప్పేందుకు. పార్టీని వీడితే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయనను ఒప్పించాను. వాట్సప్‌లో ఈ విధంగా నా ఫోటో రావడం నాకు చాలా బాధగా ఉంది. నేను పార్టీ వీడిపోతున్నానేమో అని చెప్పి సుమారు 20 మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. హనుమంతన్నా నీవు కాంగ్రెస్ వీడిపోతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంత మందికని చెప్పాలి. నేను కాంగ్రెస్‌లో పుట్టినా.. కాంగ్రెస్‌లోనే చస్తా.. ఈ అసత్య వార్తలు చాలా ప్రమాదకరం. ఒకరికున్న ఈమేజ్‌ను పడగొట్టటానికి అవతలి వారి వ్యక్తిగతాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. - వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
'నేను కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్‌లోనే చస్తా..' ఇదీ చూడండి :జైలుశిక్షల్లేవ్.. తొలిసారి చిక్కిన డ్రంకెన్ డ్రైవర్లకు ఉపశమనం