హైదరాబాద్‌లో పర్యటిస్తోన్న పార్లమెంటరీ స్థాయి సంఘం.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. మంగళవారం రోజు హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్‌ను సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలో ఐటీ స్థాయి సంఘం.. ఇవాళ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో కేటీఆర్‌తో పాటు ఐటీ శాఖ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఐటీ ఎకోసిస్టం ఎవాల్వింగ్, ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్.. కమిటీకి వివరించారు. ఐటీ, ఇండస్ట్రీతో రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టం, అకడమియా బిగ్ సపోర్ట్‌గా నిలుస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. సమావేశం అనంతరం ఎంపీ శశిథరూర్‌తో కూడిన స్థాయి సంఘం ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సన్మానించారు. తెలంగాణ చేనేత వస్త్రాలు, కళాకృతులను బహుకరించారు.
మహేశ్‌తో సరదాగా ముచ్చట..
సమావేశం అనంతరం అదే హోటల్లో షూటింగ్ జరుపుకుంటోన్న హీరో మహేశ్ బాబును పార్లమెంట్ స్థాయి సంఘం అధ్యక్షులు ఎంపీ శశిథరూర్ కలుసుకున్నారు. మహేశ్ బాబు బంధువు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. ముగ్గురు కలిసి మాట్లాడుకున్న వీడియోను శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం తనకు సంతోషాన్నిచ్చిందని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.