" కేసీఆర్కు రాష్ట్ర ప్రజలపై పట్టింపు లేదు" - congress leader shabbir ali fires on cm kcr that he is not caring about the telangana state his concentration is only on elections and party
రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎన్నికలు తప్ప మరో ధ్యాసలేనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. దాదాపు 450 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని ఆవేదన చెందారు.
![" కేసీఆర్కు రాష్ట్ర ప్రజలపై పట్టింపు లేదు"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3855248-234-3855248-1563274186698.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల ధ్యాస తప్ప రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలక్కర్లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సీజనల్ సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. వర్షాలు లేక యాతన అనుభవిస్తున్న రైతుల గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. వారం పాటు అసెంబ్లీ నిర్వహించి కరవు, విద్య, వైద్యం అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా కరవుపై చర్చ జరగాలని కోరారు. నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మాట్లాడితే కాళేశ్వరం తప్ప మరో సమస్యే లేనట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : మహా విషాదం: భవనం కూలి 13 మంది మృతి