తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఓటర్లు భయపడి పోలింగ్​ కేంద్రాలకు రాలేదు' - ghmc elections polling

గ్రేటర్​ ఓటర్లు భయపడటం వల్లే పోలింగ్​ కేంద్రాలకు రాలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. రాజకీయపరమైన, మతపరమైన అంశాలను ప్రస్తావించడం వల్ల నగరవాసులు భయపడ్డారని పేర్కొన్నారు.

congress leader ponnam prabhakar on ghmc polling
congress leader ponnam prabhakar on ghmc polling

By

Published : Dec 1, 2020, 6:56 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువ నమోదు కావడానికి తెరాస, భాజపా, ఎంఐఎంలే కారణమని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాజకీయపరమైన, మతపరమైన అంశాలను ప్రస్తావించడం వల్లనే ఓటర్లు భయపడి పోలింగ్‌ కేంద్రాలకు రాలేదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

నగరానికి సంబంధం లేని వారంతా వచ్చి... ఏది పడితే అది మాట్లాడడం, పోలింగ్‌ శాతం పెరగడానికి అవసరమైన చర్యలు తీసుకోకపోవడం తదితర కారణాల వల్లే ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేయలేదని ఆరోపించారు. ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పొన్నం ప్రభాకర్​ డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ABOUT THE AUTHOR

...view details