తెరాస పెట్టిన ఖర్చుపై కాంగ్రెస్ చర్చకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. జీహెచ్ఎంసీపై రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెరాస చెబుతోందన్నారు. మెట్రోకు తెరాస పెట్టిన ఖర్చు ఏమి లేదని... పాత బస్తీకి మెట్రో లైన్ ఆగిపోయిందని అన్నారు. అభివృద్ధి ప్రణాళిక కాదది.. అది అవినీతి నివేదిక అని దానిపై విచారణ చేపట్టాలని పొన్నాల వెెల్లడించారు.
"కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గోదావరి నది జలాలను హైదరాబాద్కు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఒక్క మెగా వాట్ కరెంట్ ఉత్పత్తి చేయకుండా వేల కోట్ల రూపాయల ఖర్చు ఎలా అయ్యింది. ఎల్ఆర్ఎస్ పేరుతో వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. జాతర్లల్లో అమ్ముకునే వాళ్లు వచ్చినట్టు భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. భాజపా రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. మనకు నీళ్లు రాకుండా అడ్డుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఏ ముఖం పెట్టుకుని మన రాష్ట్రానికి వచ్చాడు.