అవినీతి కోసమే కేసీఆర్ నూతన పథకాలు ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి ప్రజారంజక పాలన చేస్తానన్న కేసీఆర్... గత ఐదేళ్లుగా ప్రజాకంఠక పాలన చేశారా.. అన్ని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ప్రజాప్రతినిధులు నాటిన మొక్కలు కనపడకపోతే ఉద్యోగాలు పోతాయంటున్న ముఖ్యమంత్రి.. తాను చేసిన అన్యాయాలపై ఎలాంటి శిక్ష వేయాలో తెలపాలన్నారు. కొత్త చట్టాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్.. మీకెలాంటి శిక్ష వేయాలి: పొన్నాల - congress leader ponnala
ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల ధ్వజమెత్తారు. నూతన చట్టాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఎప్పుడు అమలుచేస్తారో తెలపాలన్నారు.

కేసీఆర్.. మీకెలాంటి శిక్ష వేయాలి: పొన్నాల
కేసీఆర్.. మీకెలాంటి శిక్ష వేయాలి: పొన్నాల
ఇవీ చూడండి: 'యురేనియం తవ్వకాలతో రాష్ట్రం విషతుల్యమవుతుంది'