తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటలపై విచారణకు ఇదా సమయం: నిరంజన్​ - ఈటల రాజేందర్​ వార్తలు

కరోనా పరిస్థితులపై రోజువారి సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి ఈటలపై విచారణకు ఇది సమయమా.. అని కాంగ్రెస్​ నేత నిరంజన్​ నిలదీశారు. కక్ష సాధింపులతో ప్రజల ప్రాణాలను గాలికొదిలేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

congress leader niranjan
తెరాస పాలనపై సీబీఐ విచారణ కోరిన నిరంజన్​

By

Published : May 2, 2021, 9:47 AM IST

మంత్రి ఈటల రాజేందర్​పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో.. కేసీఆర్​ పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్​ రాష్ట్ర అధికార ప్రతినిధి నిరంజన్​ డిమాండ్​ చేశారు. కరోనా పరిస్థితులను రోజు వారీగా పర్యవేక్షిస్తున్న ఈటలపై విచారణకు ఇదే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలన్నారు. కక్ష సాధింపులతో ప్రజల ప్రాణాలను గాలికొదిలేయవద్దని సూచించారు.

ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, మందులు లేవని.. ప్రజలు బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్నా.. పురపాలక ఎన్నికలు నిర్వహించారని మండిపడ్డారు.

ఇవీచూడండి:ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం?

ABOUT THE AUTHOR

...view details