వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. జలయజ్ఞం ద్వారా రైతులకు సాగునీటి అవసరాలు తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెదేపా నేతలను భాజపాలో చేర్చుకుని అధికారంలోకి వస్తామని చెబుతున్నారని... తెరాసకు హస్తం పార్టీనే ప్రత్యామ్నయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రాలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెరాసకు కాంగ్రెసే ప్రత్యామ్నాయం: మల్లు రవి.
వైఎస్ ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ 70వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
mallu ravi