ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజలలో వ్యతిరేకత వస్తే ప్రజల పక్షాన పోరాడుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజకీయం చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడిన ఆయన... కార్మికుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటీకరణ అని సీఎం నోట రానందున.. ఇక ఉండదని అనుకుంటున్నానని అన్నారు.
'ఛార్జీల పెంపుపై వ్యతిరేకత వస్తే పోరాడతాం' - latest news on congress at telangana
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు. కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలు, అత్యాచారాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

'ఛార్జీల పెంపుపై వ్యతిరేకత వస్తే పోరాడతాం'
రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. శంషాబాద్ ఘటన చాలా బాధాకరమన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలన్నారు. దాబాలు, నగర శివారు ప్రాంతాల్లో భద్రత పెంచాలని సీఎం, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.
'ఛార్జీల పెంపుపై వ్యతిరేకత వస్తే పోరాడతాం'
ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'
Last Updated : Nov 30, 2019, 7:54 AM IST