తెలంగాణ

telangana

ETV Bharat / city

గూడూరు నారాయణ రెడ్డి నేతృత్వంలో ప్లాస్మా దాతల అసోసియేషన్ - పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి నేతృత్వంలో ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటు

కొవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు అందించే ప్లాస్మా చికిత్స కోసం... ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటుకు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ముందుకొచ్చారు. అసోసియేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

congress-leader-guduru-narayana-reddy-established-plasma-donors-association
గూడూరు నారాయణ రెడ్డి నేతృత్వంలో ప్లాస్మా దాతల అసోసియేషన్

By

Published : Jul 2, 2020, 10:36 AM IST

కొవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా చికిత్సలు అందించాలని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కోరారు. ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. దీని ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా‌, మానవతా వాదిగా మక్కువ చూపినట్లు తెలిపారు. ఇద్దరు ప్లాస్మా దాతలతో ఒక కరోనా రోగి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అసోసియేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ కరోనా నుంచి బయట పడిన తాను ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సేవా దృక్పథంతో అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించానని... ఇందులో రాజకీయ కోణాలు వెతకొద్దని విజ్ఞప్తి చేశారు.

కొవిడ్‌ బారి నుంచి కోలుకున్న వారిలో ప్లాస్మా దానం చేసేందుకు అర్హత కలిగిన వారి వివరాలు, విధివిధానాలు, వారికి సంబంధించిన వివరాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్లాస్మా చికిత్స విజయవంతం అయ్యిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ రోగుల సంఖ్య వేలల్లో ఉందని, రోజువారీగా కూడా రోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చన్న ఆయన అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేేశారు.

ఇదీ చూడండి:ర‌క్త ప‌రీక్ష‌తో కరోనా వైర‌స్‌ తీవ్ర‌త అంచ‌నా!

ABOUT THE AUTHOR

...view details