ముఖ్యమంత్రి ఆరోగ్యంపై సామాజిక మాద్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. సీఎం ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు.
సచివాలయం కూల్చివేతపైనా గూడూరు స్పందించారు. ఇప్పటికిప్పుడు కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా భవనాలు కొవిడ్ ఆస్పత్రిగా వాడుకునేందుకు అనువుగా ఉండేవని అభిప్రాయపడ్డారు. పోలీసు బలగాలను మోహరించి కూల్చేయడం ఏంటని నిలదీశారు.