రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం నుంచి (congress high command calls telangana leaders to delhi)పిలుపు వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఘోర పరాజయంపై వివరణ ఇచ్చేందుకు దిల్లీ (congress high command calls telangana leaders) రావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే వచ్చిన అంశాన్ని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ ఓటమిపై కర్ణాటక రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఓ కమిటీని వేసిన ఏఐసీసీ.. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
రాష్ట్రం నుంచి 13 మంది నేతలు ఈనెల 13న ఉదయం 10 గంటలకు దిల్లీకి రావాలని (congress high command calls telangana leaders) ఏఐసీసీ ఆదేశించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇద్దరు ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, హుజూరాబాద్ ఉపఎన్నికల అభ్యర్థి బల్మూరి వెంకట్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ తదితరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.