తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం - Telangana Muncipal Elections

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్​ పేర్కొన్నారు. భాజపా.. తెరాసకు లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు.

Congress De victory in Telangana "Purapooru"
తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం

By

Published : Jan 13, 2020, 3:16 PM IST


మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. క్షేత్రస్థాయిలో డీసీసీలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగిందని..భాజపా, తెరాస లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ ఒక్కటేనని భాజపా అసత్యప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details