ఇఫ్లూలో అధ్యాపక నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజి ఆచారికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దాసోజు శ్రవణ్‌కుమార్, యువజన కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్‌లు వినతి పత్రం అందచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంతో పాటు కొత్తగా ఏర్పాటైన ఇఫ్లూలో కూడా బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు.
వర్సిటీల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: కాంగ్రెస్ - telangana varthalu
ఇఫ్లూలో నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారికి కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన.. ఇఫ్లూ ఉపకులపతి సహా అధికారులను ఈ నెల 25న హాజరు కావాలని ఆదేశించారు.
వర్సిటీల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని కాంగ్రెస్ ఫిర్యాదు
ఇఫ్లూ యాజమాన్యం 58 ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో బీసీలకు కేవలం 8 పోస్టులనే కేటాయించారని వివరించారు. వినతి పత్రంపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజి ఆచారి ఇఫ్లూ ఉపకులపతి సహా అధికారులను ఈ నెల 25న హాజరు కావాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ శాఖల్లో పదోన్నతి ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఆరా