తెలంగాణలో తమకు పట్టున్న ఆరు స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అక్కడ కచ్చితంగా గెలవాలన్న దృఢ నిశ్చయంతో కార్యచరణ రూపొందిస్తోంది. మల్కాజిగిరి, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో హస్తం జెండా ఎగరవేయాలని కసరత్తు ప్రారంభించింది.
బరిలో కీలక నేతలు
ఇప్పటికే ఆరు స్థానాల్లో కీలక నేతలను బరిలోకి దింపింది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి స్థానానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పోటీలో దింపింది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి రేణుకా చౌదరి, మహబూబాబాద్‌కు బలరాంనాయక్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పోటీకి నిలబెట్టింది.
ముఖ్య నేతల ప్రచారం
ఈ ఆరు స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానమే నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. హస్తం పార్టీకి పట్టున్న స్థానాలు కావటం వల్ల గెలుపుపై కన్నేసింది. ముఖ్య నేతలను ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల సభల నిర్వహణపై రాహుల్‌గాంధీతో చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి:మెదక్ భాజపా అభ్యర్థిగా రఘునందన్‌రావు