తెరాస వైఫల్యాలే తన విజయానికి దోహదపడతాయని గాంధీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం చంద్రకళ శంకర్ అంటున్నారు. గాంధీనగర్ డివిజన్ నుంచి రెండు పర్యాయాలు ఓడిపోయినా... మూడో సారి ఎలాగైనా విజయం సాధించాలని బరిలోకి దిగినట్లు చంద్రకళ తెలిపారు.
తెరాస వైఫల్యాలే నా విజయానికి బలాలు: కాంగ్రెస్ అభ్యర్థి - గాంధీనగర్లో కాంగ్రెస్ ప్రచారం
హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం చంద్రకళ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న తనను ఈ సారైన గెలిపించి ప్రజాసేవకు అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు.
congress candidate chandrakala campaign in gandhinagar
అవినీతి పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని చంద్రకళ ఆరోపించారు. ఈ సారి తప్పనిసరిగా ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లోని అనేక సమస్యలు పేరుకుపోయాయని.. వాటన్నింటి పరిష్కరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.