గ్రేటర్పోరుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాలకు పీసీసీ సమన్వయకర్తలను అధిష్ఠానం నియమించింది. ఈరోజు సాయంత్రం ఎన్నికల నిర్వహణ, ప్రణాళిక కమిటీని ప్రకటించనున్న కాంగ్రెస్... రేపటిలోగా అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ నెల 19న అభ్యర్థులకు బి ఫారాలు అందించనున్న హస్తం పార్టీ... 21న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
గ్రేటర్ పోరుకు కాంగ్రెస్ సమాయత్తం... రేపటిలోగా అభ్యర్థుల ఖరారు - GHMC election updates
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కమిటీలను టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. బల్దియా పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్డులను నియమించారు.
congress announced Coordinators for GHMC elections
3 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఐదుగురు చొప్పున రెండు పార్లమెంట్లకు ఆరుగురు సభ్యులను ప్రకటించారు. సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరుగురు సభ్యులను నియమించారు.
సమన్వయకర్తలుగా...
- హైదరాబాద్ సమన్వయకర్తగా మాజీమంత్రి షబ్బీర్ అలీ
- సికింద్రాబాద్ సమన్వయకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- చేవెళ్ల సమన్వయకర్తగా పొన్నం ప్రభాకర్
- మల్కాజ్‌గిరి సమన్వయకర్తగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- మెదక్ సమన్వయకర్తగా కుసుమకుమార్