తెలంగాణ

telangana

ETV Bharat / city

'భూమన్నను వెంటనే విడుదల చేయాలి' - kodandaram

సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు భూమన్నను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్​, తెజస నేతలు డిమాండ్​ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి, కోదండరాం, తదితరులు అదనపు డీజీ జితేందర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

'భూమన్నను వెంటనే విడుదల చేయాలి'

By

Published : Oct 1, 2019, 9:57 PM IST

'భూమన్నను వెంటనే విడుదల చేయాలి'

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భూమన్న అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి పార్టీ నేతలు మండిపడ్డారు. ఆయనపై పెట్టిన కేసులు ఉపసంహరించి, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, తదితరులు డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ జితేందర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై విచారణ జరిపి, న్యాయం చేస్తానని అదనపు డీజీ హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details