తెలంగాణలో 127 స్థానాల్లో మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ముగిసిందని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు పూర్తయిన వాటిలో 119 మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపా కలిసి పోయాయని.. తెరాసను ఎదుర్కోలేక రెండు జాతీయ పార్టీలు విలువలను వదిలేశాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్, భాజపా కలిసినా.. కారు జోరు ఆగలేదు! - తెలంగాణ రాష్ట్రంలో 127 స్థానాల్లో మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి జిల్లాలో తెరాస జెండా ఎగురవేసినట్లు తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 127 స్థానాల్లో మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ముగిసిందని.. 119 మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకున్నామని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
కాంగ్రెస్, భాజపా కలిసినా.. కారు జోరు ఆగలేదు..!
అనితరసాధ్యమైన ఫలితాలను ప్రజలు తెరాసకు కట్టబెట్టారని.. తమ అభ్యర్థులు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని.. ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.