ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. స్వర్ణంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని కొనియాడారు. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించాడని ట్వీట్ చేశారు. నీరజ్ చోప్రా స్వర్ణంతో భారత్ కల నెరవేరిందన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వందేళ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. హరియాణా రాష్ట్ర పౌరుడు సైన్యంలో సుబేదారుగా సేవలందిస్తూనే ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో అసమాన పటిమతో భారతదేశానికి తొలి స్వర్ణం సాధించారని కొనియాడారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాతోపాటు అతని తండ్రి సతీశ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... నీరజ్ చోప్రాకు అభినందలు తెలిపారు. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించాడని కొనియాడారు. నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందని ట్వీట్ చేశారు. నీరజ్‌కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.