లాక్‌డౌన్ నేపథ్యంలో వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం నెలకొంది. ఇందుకు సంబంధించి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో సుమారు అయిదున్నర లక్షల వాహనాలు ఉన్నాయి. వీటికి ప్రతి మూణ్నెల్లకు ఒకదఫా రవాణా పన్ను చెల్లించాలి. ఆ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తుంది. నెల రోజులుగా కరోనా కారణంగా అనేక వాహనాలు నిలిచిపోయాయి.
ప్రస్తుతం ఎవరైనా వాహన యజమానులు పన్ను చెల్లించాలన్నా మీసేవా కేంద్రాలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీ నుంచి అయితే 50 శాతం అపరాధ రుసుముతో పన్ను కట్టాలి. అదే అధికారుల తనిఖీలో అధికారులు పట్టుకుంటే 100 శాతం చెల్లించాల్సిందే. ప్రస్తుతం వ్యాపారం లేనందున పన్ను మినహాయింపు ఇవ్వాలని వాహనదారులు రవాణాశాఖను కోరారు.