ఏపీలో పదో తరగతి పరీక్షల సమయంపై అధికారుల ఉత్తర్వులు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పరీక్ష సమయం 3.15 గంటలని చెప్పగా.. తాజా ఉత్తర్వుల్లో 2.45గంటల సమయమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఉంటుందా.. లేదా..
సచివాలయంలో ఈనెల 3న పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినప్పుడు ఉదయం 9.30 నుంచి 12.45వరకు పరీక్ష సమయమని విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇందుకు విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పరీక్షల్లో అరగంట అదనపు సమయం ఉంటుందా లేదా అనేదానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
అదనపు అరగంట:
గతేడాది 11 పరీక్షలను ఆరుకు తగ్గించి, అరగంట సమయం పెంచారు. ఈసారి పరీక్షలను ఏడుకు పెంచినా అదనపు అరగంటను తొలగించారు. ఒకేసారి పాఠాలన్నీ చదివి పరీక్ష రాయాల్సి వస్తుండగా అరగంట సమయం తొలగింపుపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పదో తరగతి పరీక్షలకు 2.45గంటలున్న సమయాన్ని 3.15గంటలకు పెంచుతూ గతేడాది జూన్ 12న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.