జేఈఈ మెయిన్ నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్టీఏ ఆరంభంలోనే గందరగోళం సృష్టించింది. హడావిడిగా షెడ్యూలు ప్రకటించి.. మళ్లీ వెనక్కి తీసుకుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ షెడ్యూలుపై మంగళవారం సాయంత్రం సమాచార బులెటిన్‌ను వెబ్సైట్లో ఎన్టీఏ అప్లోడ్ చేసింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మొదటి విడత పరీక్ష ఉంటుందని.. మంగళవారం నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు బులిటెన్‌లో వెల్లడించింది.
జేఈఈ మెయిన్ నిర్వహణ తేదీల్లో గందరగోళం... - jee main exam schedule
దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్ష నోటిఫికేషన్‌కు సంబంధించి మంగళవారం సాయంత్రం సమాచార కరపత్రాన్ని ఎన్నీఏ వెబ్సైట్లో ఉచ్చి.... రాత్రి వరకు తొలగించటం చర్చనీయాంశంగా మారింది.
confusion in jee main exam dates
ఆ బులిటెన్‌ను రాత్రి వరకు వెబ్సైట్ నుంచి ఎన్టీఏ తొలగించింది. దీన్నిబట్టి చూస్తే... షెడ్యూలులో కొన్ని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. పరీక్ష తేదీల్లో కొంత గందరగోళం ఏర్పడినప్పటీకీ.. జేఈఈ మెయిన్ నాలుగు సార్లు నిర్వహించనున్నట్టు మాత్రం ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మార్చిలో జేఈఈ మెయిన్ నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది.