తెలంగాణ

telangana

ETV Bharat / city

'మా' లో మళ్లీ విభేదాలు.. రాజశేఖర్​ 'చిరు' గొడవ! - rajashekhar fires on chiranjivi

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో కాసేపు గందరగోళం తలెత్తింది. సంస్థ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన పరిస్థితుల్లో.. చిరంజీవి, కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

maa
maa

By

Published : Jan 2, 2020, 1:16 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశానికి సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధతో పాటు.. మా బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. అసోసియేషన్​లో ఉన్న లుకలుకలపై.. మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో వేదికపై అందరి ముందే.. చిరంజీవి మాట్లాడిన తీరును తప్పుబట్టినట్టుగా మాట్లాడారు. మంచిని అందరిముందూ మాట్లాడుకుని.. చెడును మాట్లాడవద్దంటే ఎలా అని ప్రశ్నించారు. దాచినంత మాత్రాన ఏదీ దాగదని వ్యాఖ్యానించారు.

రాజశేఖర్ వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా తప్పుబట్టారు. బహిరంగంగా ఇలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఇదంతా కావాలని ప్లాన్ చేసిన కుట్రగా చెప్పారు. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం.. కృష్ణంరాజు మాట్లాడారు. మా లో ప్రత్యేక కమిటీ వేస్తామని.. సమస్యలు, అసంతృప్తులు ఉంటే కమిటీ ఎదుట మాత్రమే చెప్పాలని స్పష్టం చేశారు.

'మా' అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రసాభాస

ఇదీ చూడండి: ఇప్పుడు పోలీసుగా.. తర్వాత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా

ABOUT THE AUTHOR

...view details