ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిధంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ తెదేపాకు చెందిన పలువురు పోలింగ్ సెంటర్లోకి దూసుకెళ్లారు.
ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్ - గుంటూరు జిలాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఏపీ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఫణిధం గ్రామంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరగడం వల్ల పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జీ చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి ఇరువర్గాలను పంపించటం వల్ల వివాదం సద్దుమణిగింది.
ఇవీచూడండి:ఏపీ పల్లె పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..