తెలంగాణ

telangana

ETV Bharat / city

స్థల వివాదంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ, చివరికి

CONFLICT BETWEEN YSRCP AND TDP ఏపీలో వైకాపా వర్గీయుల దాడులు హద్దు మీరుతున్నాయి. ఎదురించిన వారిపై దాడి చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కదిరిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోర్టు పరిధిలోని ఉన్న స్థలంలో నిర్మాణానికి వైకాపా వర్గీయులు సిద్ధమవగా అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు ప్రయత్నించడంతో వైకాపా వర్గీయులు మరింత రెచ్చిపోయారు.

conflict
conflict

By

Published : Aug 24, 2022, 5:59 PM IST

Updated : Aug 24, 2022, 6:05 PM IST

CONFLICT BETWEEN YSRCP AND TDP ఆంధ్రప్రదేశ్​లోని శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఓ స్థల వివాదం వైకాపా, తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణకు దారితీసింది. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణానికి వైకాపా వర్గీయులు సిద్ధమవగా.. అడ్డుకునేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. పనులు చేయకుండా పొక్లెయిన్, టిప్పర్లను అడ్డగించారు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు.. వాహనాన్ని వేగంగా ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు.

ఆ మేరకు వేగంగా వాహనాలను జనం వైపు నడిపారు. ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వెంటనే తెలుగుదేశం వర్గీయులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అర్బన్ సీఐ మధు మీసం మెలేస్తూ తెలుగుదేశం నాయకులను దూషించారు. ఆ తర్వాత అదనపు బలగాలను రప్పించి ఇరువర్గాలను అక్కడినుంచి పంపించి వేశారు. ఈ గొడవ జరుగుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతికి గాయమైంది.

కదిరిలో స్థల వివాదం, తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

ఇవీ చదవండి:

Last Updated : Aug 24, 2022, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details