ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం పోలీసులు, ఉపాధ్యాయులపై ఓ వర్గం వాళ్లు రాళ్లు విసిరారు. ఈ ఘర్షణలో ఓ కానిస్టేబుల్, మరో మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని తరిమికొట్టారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ.. పోలీసులు, ఉపాధ్యాయులపైకి రాళ్లు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ కానిస్టేబుల్, మరో మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి.
పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ
గత నెల 22 మొదటగా గ్రామంలో విద్యాకమిటీ ఎన్నికలను అధికారులు చేపట్టారు. ఎన్నికల సమయంలో తెదేపా, వైకాపా మధ్య ఉద్రిక్తత నెలకొనటంతో అధికారులు నేటికి ఎన్నికలను వాయిదా వేశారు.
ఇదీ చదవండి:krishna tribunal:కృష్ణా ట్రైబ్యునల్ నియామకంపై పిటిషన్ ఉపసంహరణకు సుప్రీం అనుమతి