అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డితో భట్టి, రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. రాజగోపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి మధ్య మొదట వాగ్వాదం మొదలైంది. వారిని వారించేందుకు ప్రయత్నించిన భట్టి విక్రమార్కతోనూ వాగ్వాదం పెట్టుకున్నారు. గొడవ పెద్దగా జరగడంతో అప్రమత్తమైన ఇతర సభ్యులు... ముగ్గురినీ వారించి అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పరిస్థితి శాంతించింది.
అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల వాగ్వాదం - BHATTI
విరామ సమయంలో... అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇతర సభ్యులు వారించడంతో పరిస్థితి చక్కబడింది.

అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం