విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో నారాయణస్వామి కుటుంబం జీవిస్తోంది. ప్రతి నెల.. వారికి విద్యుత్ బిల్లు రెండు నుంచి మూడు వందల వచ్చేది. అలాంటింది గత నెలలో ఏకంగా రూ.16 వేలు బిల్లు రావటంతో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. ఇంట్లో అధికంగా విద్యుత్ వాడుతున్నారని నిత్యం మద్యం తాగి వచ్చి.. భార్యతో గొడవపడేవాడు.. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏకంగా ఇంటికి రావడమే మానేశాడు. దీంతే కంగారు పడిన భార్య పోలీసుల వద్దకు పరుగులు తీసింది.
Current bill: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. దంపతుల మధ్య చిచ్చు - భార్యభర్తల మధ్య చిచ్చు రేపిన విద్యుత్ బిల్లు న్యూస్
పచ్చిని కాపురంలో విద్యుత్ బిల్లు చిచ్చు రేపింది. చిలకా గోరింకలా కలిసి మెలిసి జీవించే దంపతుల మధ్య వివాదాన్ని సృష్టించింది. విద్యుత్ బిల్లు దంపతుల మధ్య చిచ్చు రేపటం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
![Current bill: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. దంపతుల మధ్య చిచ్చు Current bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12113452-335-12113452-1623518218137.jpg)
ఓ ఇంటికి ఏకంగా రూ. 16 వేలు బిల్లు
గత నాలుగు రోజుల నుంచి ఇంటికి రావటం లేదని.. తన భర్త కనిపించటం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అధిక బిల్లు వచ్చిందని.. తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు వాపోయింది.
ఇదీచదవండి:రైతు ఆవిష్కరణ.. రూ.25వేలకే ట్రాక్టర్!