తెలంగాణ

telangana

ETV Bharat / city

కోడెల మృతిపై.. సంతాపాల వెల్లువ - yanamala ramkrishnudu

కోడెల హఠాన్మరణంపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెదేపా శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగాయి.

kodela shiva prasad

By

Published : Sep 16, 2019, 3:25 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కోడెల శివప్రసాద్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. కోడెల మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెదేపా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, యరపతినేని శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. మంచి స్నేహితుడిని కోల్పోయామని తెదేపా నేతలు ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details