వలస కూలీలకు అండగా అపార్ట్మెంటు వాసులు - కాంక్రీట్ ప్లాజా అసోసియేషన్ సరకుల పంపిణీ
నాచారంలోని కాంక్రీట్ ప్లాజా నివాసులు వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జేసీ హరీశ్ హాజరయ్యారు. పేదలకు చేయూతనివ్వడం పట్ల వారిని అభినందించారు.
![వలస కూలీలకు అండగా అపార్ట్మెంటు వాసులు concrete plaza assocoation groceries distribute to migrant labour in nacharam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668264-thumbnail-3x2-asdf.jpg)
వలస కూలీలకు అండగా అపార్ట్మెంటు వాసులు
మేడ్చల్ జిల్లా నాచారం రాఘవేంద్రనగర్‌లో కాంక్రీట్ ప్లాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ హరీశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు కూలీలకు చేయూత ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. వారం రోజులుగా కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్టు అపార్ట్మెంటు వాసులు తెలిపారు.
వలస కూలీలకు అండగా అపార్ట్మెంటు వాసులు
TAGGED:
నాచారంలో సరకుల పంపిణీ