నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో సాగిన అభిప్రాయ సేకరణ శనివారం మధ్యాహ్నం ముగిసింది. మూడ్రోజుల్లో 154 మంది నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన మాణిక్కం.. ఇవాళ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు.
పీసీసీపై ముగిసిన అభిప్రాయ సేకరణ.. అధిష్ఠానానికి నివేదిక - Manickam Tagore on tpcc president
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముగిసింది. నాలుగు రోజులుగా సాగిన నేతల అభిప్రాయ సేకరణ శనివారం మధ్యాహ్నం పూర్తయింది.

అభిప్రాయ సేకరణ నివేదికను మాణిక్కం.. కాంగ్రెస్ అధిష్ఠానానికి సమర్పించనున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే పార్టీకీ ప్రయోజనం ఉంటుందో వివరించనున్నారు. గతంలో అధిష్ఠానం సీల్డ్ కవర్లో నాయకుని పేరు ప్రకటించేదని.. ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా నేతలందరికి ఆమోదయోగ్యమైన అధ్యక్షుణ్ని నియమించేందుకు అభిప్రాయ సేకరణ చేశామని మాణిక్కం తెలిపారు.
నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని తెరాస, భాజపా, ఎంఐఎంలకు దీటుగా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకుణ్ని అధిష్ఠానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.
- ఇదీ చూడండి :నిరసనలో వైవిధ్యం- వినోదానికీ సంసిద్ధం