ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగర్ అతలాకుతలమయింది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ప్రహరీ గోడ కూలి.. పాత్వేపై పడటం వల్ల.. వాకింగ్, జాగింగ్ చేసేవారు ఇబ్బంది పడ్డారు.
కేబీఆర్ పార్కులో కూలిన గోడ.. వాకర్ల ఇబ్బందులు - భారీ వర్షాలు
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో ప్రహరీగోడ కూలిపోయింది. ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్ చేసే మార్గానికి అడ్డుగా గోడ పడిపోవడం వల్ల వాకర్లు ఇబ్బందులు పడ్డారు.
కేబీఆర్ పార్కులో కూలిన గోడ.. వాకర్ల ఇబ్బందులు
పార్కులో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిపిపోయి... బురద వల్ల ఇబ్బందిగా ఉందని.. అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి కూలిన గోడ.. వరద నీరు తొలగించాలని వాకర్లు కోరారు. వర్షం కారణంగా ఇబ్బంది కలిగినప్పటికీ పార్కు తెరిచే ఉంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం