దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ.. గుడ్డి ద్వేషం ఎందుకు, గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అంటూ మాట్లాడినట్లు దివ్యాంగుల సెల్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు.
కేటీఆర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ - latest complaint on ktr
దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సెల్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే తన మాటలను వెనక్కు తీసుకొవాలని.. దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేటీఆర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆ మాటలు వికలాంగుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని కమిషన్‌కు వివరించారు. దివ్యాంగుల హక్కులను కాపాడాలని కోరారు. దివ్యాంగుల జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే తన మాటలను వెనక్కు తీసుకొని.. దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: గేట్స్ ఫౌండేషన్ మరో భారీ సాయం