కరోనాతో మృతి చెందిన కార్మికులకు కుటుంబాలకు ఏపీఎస్ఆర్టీసీ పరిహారం అందజేస్తోంది. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను మంత్రి పేర్నినాని పంపిణీ చేశారు. ఆర్టీసీలో 50 వేలమందిలో 4,700 మందికి కరోనా వచ్చింరదని మంత్రి వెల్లడించారు.
కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు - కార్మికులకు కుటుంబాలకు ఏపీఎస్ఆర్టీసీ పరిహారం
కరోనాతో మృతిచెందిన కార్మికులకు కుటుంబాలకు ఏపీఎస్ఆర్టీసీ రూ.5 లక్షలు పరిహారం అందజేస్తోంది. ఈ మేరకు చెక్కులను మంత్రి పేర్నినాని పంపిణీ చేశారు. ఆర్టీసీలో 50 వేలమందిలో 4,700 మందికి కరోనా వచ్చిందని మంత్రి వెల్లడించారు.
కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు
కరోనాతో ఇప్పటి వరకు 73 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కార్మికుల ఒకరోజు వేతనంతో పరిహారం అందిస్తున్నారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని కార్మికులు ఇస్తున్నట్లు తెలిపారు. కార్మికులను కొవిడ్ వారియర్స్ కోసం ప్రతిపాదనలు పంపామని.. కేంద్రం నుంచి ఆమోదం రాగానే వారియర్స్‌గా గుర్తిస్తామన్నారు.
ఇదీ చదవండి:దోస్త్: రెండో విడత సీట్లు కేటాయింపు.. 6 వరకు సమయం