వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం నాలుగు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. హైదరాబాద్ నాగోల్ డివిజన్లోని మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో చెరుకు సంగీత, ప్రశాంత్ వరద బాధితులకు అధికారులు రూ. 10వేలు అందించారు. ముంపునకు గురైన ఓ ఇంటికి రూ. 10వేలు ఇచ్చి ఆ ఇంట్లో నివాసముంటున్న నాలుగు కుటుంబాలకు నగదు పంచుకోవాలని చెప్పారు.
ఘర్షణకు దారితీస్తోన్న వరద బాధితులకు ఆర్థిక సాయం
వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఘర్షణలకు దారితీస్తోంది. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ డివిజన్లో రూ.10 వేల కోసం నాలుగు కుటుంబాలు గొడవ పడ్డాయి.
వరదబాధితుల వాగ్వాదం
ఇంటి యజమాని తన వాటాగా రూ. 5 వేలు ఇవ్వాలని అడగడం వల్ల నాలుగు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇలా చేయడం వల్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తోందా.. కార్పొరేటర్, అధికారుల చేతివాటమా తెలియక.. ప్రశాంతంగా ఉన్న కాలనీల్లో కొట్లాటలు జరుగుతున్నాయని వాపోయారు.
Last Updated : Oct 29, 2020, 2:35 PM IST