వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్లో పర్యటించారు. మాలబస్తీలో వరద బాధితుల కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
'వరద బాధితులను రాష్ట్ర సర్కార్ నిష్పక్షపాతంగా ఆదుకుంటోంది' - హైదరాబాద్ వరద బాధితులకు ఆర్థిక సాయం
వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిష్పక్షపాతంగా, పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ మాల బస్తీలో వరద బాధితుల కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
హైదరాబాద్ వరద బాధితులకు ఆర్థిక సాయం
వరద బాధితులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని, ప్రభుత్వం నిష్పక్షపాతంగా అందరికీ సాయం చేస్తోందని తెలిపారు. ఈ కార్య క్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్, తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.