తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ.. సీఎం సమక్షంలో నిర్ణయాలు వెల్లడి! - ap govt employees protest

committee of ministers meet AP employees: ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాలన్న ఆయన.. ఫిట్​మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది.

committee of ministers meet with AP employees
ఏపీ ఉద్యోగ సంఘాలు

By

Published : Feb 5, 2022, 5:09 PM IST

committee of ministers meet AP employees: ఏపీ ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్​ఆర్ఏ స్లాబ్​లు, ఐఆర్ రికవరీతో పాటు శుక్రవారం అర్ధరాత్రి ప్రతిపాదించిన అంశాలపై చర్చ కొనసాగుతోంది. సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రుల కమిటీ వెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో భేటీకి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌కు కమిటీ నివేదించింది.

చిన్న చిన్న విషయాలే: బొత్స

‘‘శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం. ఈ మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో సమావేశమవుతాం. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల గురించి ఈ రోజు చర్చిస్తాం. ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చాం. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తాం’’ అని బొత్స అన్నారు.

ఫిట్​మెంట్​ 23 శాతంలో మార్పుండదు..

ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాలన్న ఆయన.. ఫిట్​మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు అడిగారన్న సజ్జల...హెచ్​ఆర్ఏ శ్లాబుల్లో సవరణలతో రూ. 7వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. హెచ్ఆర్​ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని, కనీస హెచ్​ఆర్​ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగినట్లు సజ్జల వెల్లడించారు.

ఇదీ చదవండి:PM Modi on ICRISAT: 'ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి'

'ప్రధాని వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ కేసీఆర్​కు ఏముంది?'

MOdi at Icrisat: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని.. ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం

ABOUT THE AUTHOR

...view details