రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కోసం కమిటీ ఏర్పాటు - registration department news
19:07 September 18
రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కోసం కమిటీ ఏర్పాటు
రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ- డీపీసీని ఏర్పాటు చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ కన్వీనర్‌గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చిరంజీవులు, సభ్యులుగా అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి లేక అదనపు కార్యదర్శి మరో సభ్యుడు ఉంటారని వెల్లడించారు.
మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టు...సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, రెండో స్థాయి గజిటెడ్ పోస్టు....సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1లకు అర్హులైన వారికి పదోన్నతి కల్పనకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ పదవీకాలం ఉత్తర్వులు జారీ అయ్యిన తేదీ నుంచి రెండేళ్లపాటు ఉంటుందని స్పష్టం చేసింది.