ఏపీలోని గంగవరం పోర్టు (Gangavaram port)లో వాటాలను.. అదానీ పోర్ట్స్ (Adani ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో విలీనం, బదిలీ చేసేందుకు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ వాటా పెట్టుబడుల ఉపసంహరణపై.. ఉన్నతాధికారులతో కూడిన ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గంగవరం పోర్టు లిమిటెడ్‌లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణతో పాటు.. అదానీ పోర్ట్స్‌లో జీపీఎల్ విలీన ప్రక్రియను ఈ కమిటీ అమలు చేయనుంది.
Gangavaram port: గంగవరం పోర్టులో వాటాల బదిలీకి కమిటీ నియామకం
గంగవరం పోర్టులో వాటాలను.. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్లో విలీనం చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ వాటా పెట్టుబడుల ఉపసంహరణపై.. ఉన్నతాధికారులతో కూడిన ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. గంగవరం పోర్టులో 58.10 శాతం వాటాలు కలిగిన గంగవరం పోర్టు ప్రమోటర్ డీవీఎస్ రాజుకు చెందిన.. విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి అదానీ పోర్ట్స్ కు వాటాల బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుల మేరకు.. గంగవరం పోర్టు లిమిటెడ్‌ను అదానీ సెజ్‌లో విలీనం చేసేందుకు అంగీకరించింది. గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో 54 కోట్ల రూపాయల విలువైన 1800 ఎకరాల భూమిని.. 10.4 శాతం వాటాగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో.. గంగవరం పోర్టు లిమిటెడ్ నిర్మాణం జరిగింది. ఇప్పటివరకూ గంగవరం పోర్టు నుంచి.. 277.97 కోట్ల రూపాయల రెవెన్యూను ప్రభుత్వం ఆర్జించింది.