దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి విచారణ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్... హైకోర్టు ప్రాంగణంలోని సీ బ్లాక్లో మొదటి రోజు విచారణ ప్రారంభించింది. ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్ను సిట్ బాధ్యుడు మహేశ్ భగవత్ కలిశారు. ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కమిషన్కు మహేశ్ భగవత్ తెలిపారు.
సుప్రీం నియమించిన కమిషన్
ముగ్గురు సభ్యుల కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్.కార్తికేయన్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 6న దిశ హత్యాచార నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దీనిని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.