రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(telangana rains news) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్నటి అల్పపీడనం ఈరోజు పశ్చిమ, ఉత్తర ఝార్ఖండ్ పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ.. సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గాలులలోని ఆవర్తనం ఆగ్నేయ బంగళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి.. సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
Telangana Rains: బీ అలర్ట్.. తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు - heavy rains in telangana
ఇప్పుడిప్పుడే గులాబ్ నుంచి కోలుకుంటోన్న రాష్ట్రాన్ని.. మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
coming three days heavy rains in telangana
గులాబ్ తుపాను తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. మరో మూడు రోజులు వర్షాలు(Telangana Weather Updates) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు భారీ వర్షాలు(Telangana Weather Updates) కురిస్తే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలూ అప్రమత్తమయ్యారు. ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటున్న వారంతా.. మళ్లీ వానలు(Telangana Weather Updates) కురిస్తే తిప్పలు తప్పవని భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: