Rahul Ramakrishna: షార్ట్ ఫిలిం నటుడిగా కెరీర్ ఆరంభించి ‘అర్జున్‌రెడ్డి’తో హాస్యనటుడు, సహాయ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు నటుడు రాహుల్ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ విజయం తర్వాత వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఆయన కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోనూ ఆయన ఓ రోల్ పోషించారు. తరచూ తన సినిమా అప్‌డేట్స్‌తో ట్విటర్ వేదికగా నెటిజన్లను పలకరించే ఆయన తాజాగా ఓ ట్వీట్ పెట్టి.. అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఇకపై తాను సినిమాలు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు.
'2022.. ఇదే నా చివరిది.. ఇకపై నేను సినిమాలు చేయను'
Rahul Ramakrishna: ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నటనకు దూరం కానున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.
‘‘2022.. ఇదే నా చివరిది. ఇకపై నేను సినిమాలు చేయను’’ అని ట్వీట్ చేశారు. రాహుల్ చేసిన ట్వీట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘‘కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న ఆయన ఉన్నట్టుండి సినిమాలు ఆపేస్తానంటూ ప్రకటించడం ఏంటి?’’, ‘‘ఇది ఏమైనా సినిమా ప్రమోషన్సా?’’, ‘‘నిజంగా బ్రేక్ తీసుకుంటున్నారా?’’ అని పలువురు అభిమానులు కామెంట్లు పెట్టారు. ఇక, ‘భరత్ అనే నేను’, ‘చిలాసౌ’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘నెట్’, ‘స్కైలాబ్’ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇదీ చూడండి:చెర్రీ యాక్షన్ షురూ.. సైఫ్ తప్పుకొన్న చిత్రంలో కరీనా